'టీవీవీపీ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి'

Update: 2023-03-20 10:40 GMT
టీవీవీపీ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
  • whatsapp icon

దిశ ప్రతినిధి, హైదరాబాద్: వైద్య విధాన పరిషత్ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులకు వెంటను జీఓ 317 ను అమలు చేసి పదోన్నతులు కల్పించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ టీవీవీపీ కమిషనర్ విజయ్ కుమార్‌ను కోరింది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. యాద నాయక్ ఆధ్వర్యంలో టీవీవీపీ విభాగం కార్యదర్శి బైరసాక శ్రీనివాస్, డీఎంఈ విభాగం కార్యదర్శి మాలోత్ కిషన్ నాయక్‌లు సోమవారం ఆయనను కలిసి సమస్యలపై వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీవీవీపీ లో పని చేస్తున్న 1999 బ్యాచ్‌కు చెందిన స్టాఫ్ నర్సులకు నేటి వరకు పదోన్నతులు ఇవ్వడం లేదన్నారు.

మినిస్టీరియల్ స్టాఫ్, పారా మెడికల్ సిబ్బందికి కూడా దీర్ఘ కాలంగా ప్రమోషన్లు లేవని చెప్పారు. ఫార్మసీ సూపర్ వైజర్స్ పోస్టులను జిల్లాకు ఒకటి చొప్పున కేటాయించాలని, రేడియో గ్రాఫర్స్‌కు చీఫ్ రేడియోగ్రాఫర్స్‌లుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. ఎంప్లాయిస్ ఐడీ నెంబర్‌తో హెల్త్ కార్డులు ఇప్పించాలనేవి తాము ప్రధానంగా కోరుతున్నామన్నారు. దీనికి టీవీవీపీ కమిషనర్ సానుకూలంగా స్పందించారని, త్వరలో ఆయా సమస్యలు పరిష్కారమౌతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News