Raja Singh's : ఓవైసీ ఓ బుద్ధి తక్కువ ఎంపీ…రాజా సింగ్ హాట్ కామెంట్స్

టీటీడీ తీసుకున్న నిర్ణయంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-11-03 16:01 GMT

దిశ,కార్వాన్ : టీటీడీ తీసుకున్న నిర్ణయంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఆదివారం సోషల్ మీడియా వేదికగా రాజాసింగ్ విడుదల చేసిన వీడియోలో అసద్ పై మండిపడ్డారు. ఈ సందర్భంగా రాజా సింగ్ మాట్లాడుతూ.. టీటీడీ ను వక్ఫ్ పేరుతో కంపేర్ చేయడం సరికాదన్నారు. ఓవైసీ ఓ బుద్ధి తక్కువ ఎంపీ వార్తల్లో కనిపించేందుకే మాట్లాడుతాడని అన్నారు. టీటీడీ చైర్మన్ తీసుకున్న నిర్ణయానికి రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపారు. 1947లో వక్ఫ్ దగ్గర ఎంత భూమి ఉండే, ప్రస్తుతం 10 లక్షల ఎకరాల భూమి ఎక్కడ నుంచి వచ్చిందని రాజాసింగ్ ఘాటుగా ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డు పేరుతో హిందూ రైతుల నుండి పది లక్షల ఎకరాలకు పైగా భూమిని లాక్కున్నారని ఆరోపించారు. త్వరలో చట్టం వస్తుంది, ఇప్పుడు వక్ఫ్ పేరు తో కబ్జా చేసిన భూమిని ఎలా ఉపయోగించాలో కూడా మంచి చట్టం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


Similar News