పాతబస్తీలో ఎన్‌ఐఏ సోదాలు.. పీఎఫ్‌ఐ కార్యాలయం సీజ్
హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ కార్యాలయం పై గురువారం తెల్లవారుజామున ఎన్ఐఏ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ కార్యాలయం సీజ్ చేయడంతో పాటు గోడకు
దిశ, చార్మినార్ : హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ కార్యాలయం పై గురువారం తెల్లవారుజామున ఎన్ఐఏ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ కార్యాలయం సీజ్ చేయడంతో పాటు గోడకు నోటీసులు అతికించారు. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీ చాంద్రాయణగుట్ట కు చెందిన మొహమ్మద్ అబ్దుల్ రజాక్ అండ్ సన్స్ కాంప్లెక్స్ రెండవ అంతస్థులో బాబానగర్‌కు చెందిన ఖాళీద్ పాపులర్ ఫ్రంట్ అఫ్ ఇండియా సంస్థ కార్యాలయంను గత కొంతకాలంగా నడుపుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 పీఎఫ్ఐ కార్యాలయాలు, ఇండ్లపై ఏక కాలంలో ఎన్ ఐ ఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే పాతబస్తీ చాంద్రాయణ గుట్ట లోని పిఎఫ్‌ఐ కార్యాలయం పై కూడా గురువారం తెల్లవారుజామున 3గంటలకు హైటెక్ సిటీ మాదాపూర్ ఎన్‌ఐఏ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. 3గంటల నుంచి ఉదయం 7గంటల వరకు ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. కీలక మైన హార్డ్ డిస్క్, పెన్‌డ్రైవ్, ఇతర పత్రాలను స్వాదీనం చేసుకుంది. చాంద్రాయణ గుట్ట పీఎఫ్ఐ కార్యాలయాన్ని సీజ్ చేసింది. అంతేగాకుండా ఈ కార్యాలయాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ హైదరాబాద్ సీజ్ చేసిందని, ఒక వేళ సంస్థ యజమాని సీల్ తీయడానికి ముందు హైదరాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానాన్ని లేదా కింది చిరునామాలోని సంప్రదించాలని ఎన్ఐఏ నోటీసులు అతికించింది. అయితే ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు.. భారీగా పీఎఫ్ఐ సభ్యుల అరెస్ట్..
Also Read: కేరళ టు కరీంనగర్... మరోసారి ఎన్ఐఏ రైడ్స్ కలకలం?
Also Read: అర్ధరాత్రి సెర్చ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అగ్రనేతల అరెస్ట్