మనసురాబాద్ లో ముగిసిన ఎన్ఐఏ సోదాలు
మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని శ్రీనివాసపురం కాలనీలో నివాసం ఉంటున్న రవి శర్మ ఇంటిపై ఎన్ఐఏ అధికారులు గురువారం ఉదయం నుండి 11 గంటల వరకు సోదరులు చేశారు.
దిశ, ఎల్బీనగర్ : మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని శ్రీనివాసపురం కాలనీలో నివాసం ఉంటున్న రవి శర్మ ఇంటిపై ఎన్ఐఏ అధికారులు గురువారం ఉదయం నుండి 11 గంటల వరకు సోదరులు చేశారు. ఈ సోదాలలో రవిశర్మ ఇంట్లో అతని మొబైల్ తో పాటు 1990 కంటే ముందు ఉన్నటువంటి పాత పుస్తకాలను, ఫొటోలను పాంప్లెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం ఈనెల 10వ తేదీన ఎన్ఐఏ కార్యాలయానికి హాజరుకావాలని రవిశర్మకు అధికారులు వెల్లడించారు. నగరంలోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంజయ్ దీపక్ రాజు అనే వ్యక్తిపై కేసు నమోదు, అరెస్టు విషయంలో నిందితులుగా ఉన్న వేణుగోపాల్, రవిశర్మ, కేరళ కు చెందిన మరో ముగ్గురిపై కేసులు నమోదు అయినట్టు తెలిసింది. వారి ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నట్టు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు.