Uttam Kumar Reddy : రెండు టికెట్ల పంచాయితీ.అధిష్టానం నిర్ణయమన్న ఉత్తమ్
హుజూరాబాద్ నుంచి తాను, కోదాడ నుంచి పద్మావతి పోటీలో ఉన్నామని కాంగ్రెస్ ఎంపీ, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు...
దిశ, వెబ్ డెస్క్: హుజూరాబాద్ నుంచి తాను, కోదాడ నుంచి పద్మావతి పోటీలో ఉన్నామని కాంగ్రెస్ ఎంపీ, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఒకే కుటుంబలో రెండు సీట్ల విషయం కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారమే నిర్ణయాలుంటాయని ఉత్తమ్ తెలిపారు. బీసీల కోసం నల్గొండ సీటు త్యాగం చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి ప్రకటించినట్లు తనకు తెలియదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం ముందు బీఆర్ఎస్ కొట్టుకుపోతుందని విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. అది తమ పార్టీకి కలిసివస్తుందని ఉత్తమ్ పేర్కొన్నారు. త్వరగా టికెట్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధిష్టానాన్ని కోరతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
కాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రెండు సీట్లు ఇవ్వడంపై పలువురు కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తమ్ రెడ్డి స్పందించారు. తన ఫ్యామిలీలోని టికెట్ల విషయం ఏఐసీసీ చూసుకుంటుందని వివరించారు.