Hyd: సింగరేణి కాంట్రాక్ట్ టీచింగ్ ఉద్యోగులకు ఎమ్సెల్సీ కవిత కీలక సూచనలు

సింగరేణి ఏరియాలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు...

Update: 2023-09-03 12:38 GMT

దిశ, వెబ్ డెస్క్: సింగరేణి ఏరియాలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. సింగరేణి కాంట్రాక్ట్ టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులతో ఆమె హైదరాబాద్‌లోని తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులు పలు సమస్యలను కవిత దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన కవిత అన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని చెప్పారు.

ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ ఢంకా మోగించాలని సూచించారు. తెలంగాణలో అన్ని అసెంబ్లీల్లో బీఆర్ఎస్‌ను గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇవ్వాలని కోరారు. సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుందన్నారు. ఆర్టీసీని సైతం ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వం విలీనం చేశాని.. ఒక్కొక్క సమస్యకు పూర్తి పరిష్కారం చూపుతూ సీఎం కేసీఆర్ చక్కటి పాలన చేస్తున్నారని కవిత కొనియాడారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు సింగరేణిలో కారుణ్య నియామకాల కింద కేవలం 4 ఉద్యోగాలే భర్తీ చేశారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణిలో 20 వేల వారసత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. 

Tags:    

Similar News