జాతీయ కమిషన్ సభ్యుడిగా శిరందాస్ శ్రీనివాస్

నిజాం వైద్య విజ్ఞాన సంస్థ, వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన కళాశాల ప్రిన్సిపాల్ శిరందాస్ శ్రీనివాస్‌ను వైద్య అనుబంధ వృత్తుల జాతీయ కమిషన్ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది.

Update: 2025-03-27 17:06 GMT
జాతీయ కమిషన్ సభ్యుడిగా శిరందాస్ శ్రీనివాస్
  • whatsapp icon

దిశ, ఖైరతాబాద్: నిజాం వైద్య విజ్ఞాన సంస్థ, వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన కళాశాల ప్రిన్సిపాల్ శిరందాస్ శ్రీనివాస్‌ను వైద్య అనుబంధ వృత్తుల జాతీయ కమిషన్ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, వైద్య అనుబంధ వృత్తుల జాతీయ కమిషన్ కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా నిజాం వైద్య విజ్ఞాన సంస్థ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, డీన్ లిజా రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ శాంత్ వీర్‌లు శిరందాస్ శ్రీనివాస్‌ను అభినందించారు. వైద్య అనుబంధ వృత్తుల అభివృద్ధికి, విద్య, శిక్షణ విషయంలో సంస్కరణలు తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు.

శ్రీనివాస్ నిమ్స్‌లో 33 ఏళ్లుగా రేడియేషన్ సేఫ్టీ అధికారిగా, వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా సొసైటీ ఆఫ్ ఇండియన్ రేడియోగ్రాఫర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గానూ పనిచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి మెడికల్ రేడియాలజీ, ఇమేజింగ్, థెరపీ టెక్నాలజీ కౌన్సిల్‌కు ఎన్నికైన ఏకైక వ్యక్తిగా శిరందాస్ శ్రీనివాస్ నిలిచారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎలాంటి మౌలిక వనరులు లేకుండా, వసతులు లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న విద్యా సంస్థలను నియంత్రించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తన నియామకాన్ని నిమ్స్ ఉద్యోగులకు లభించిన గౌరవంగా భావిస్తానని శ్రీనివాస్ తెలిపారు.

ఈ సందర్భంగా సొసైటీ ఆఫ్ ఇండియన్ రేడియోగ్రాఫర్స్ అకాడమిక్ డైరెక్టర్ దామోదర నాయుడు, ఆఫీసు బేరర్స్ శ్రీనివాస్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంస్థ ఉద్యోగులు, పారామెడికల్ ఎంప్లాయీస్ అధ్యక్ష, కార్యదర్శులు శాంత కుమారి, భరత్ భూషణ్, నిమ్స్ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాజ్ కుమార్, బయోమెడికల్ ఇంజినీర్ శ్రీనివాస్, నిమ్స్ లైజనింగ్ అధికార్లు డాక్టర్ మార్త రమేష్, రాంబాబు, ప్రజా సంబంధాల అధికారి సత్య గౌడ్, శ్రీనివాస్‌ను అభినందించారు. ఇదే కౌన్సిల్‌లో మరో హైదరాబాదీ జీవీకే, ఈఎంఆర్‌ఐకి చెందిన సూర్ల రవికి ట్రామా, బర్న్ కేర్, సర్జికల్, అనస్థీషియా విభాగంలో సభ్యుడిగా చోటు దక్కింది.

Tags:    

Similar News