అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన..
శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని, ప్రతీ డివిజన్ లో అవసరమైన అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మెన్ అరెకపూడి గాంధీ అన్నారు.
దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని, ప్రతీ డివిజన్ లో అవసరమైన అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మెన్ అరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం మియాపూర్ డివిజన్ పరిధిలోని బొల్లారం ప్రధాన రహదారి నుండి బికే ఎంక్లేవ్, రెడ్డి కాలనీ, ప్రజా షెల్టర్ నుండి మక్త మహబూబ్ పేట్ విలేజ్ వరకు లింక్ రోడ్డు రూ. 85 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ ఉప్పల పాటి శ్రీకాంత్ తో కలిసి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని, సీసీ రోడ్లతో పాటు అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.