ఇండియన్ పోలీసు మెడల్ అందుకున్న మియాపూర్ ఏసీపీ పునాటి నరసింహరావు

హైదరాబాదులోని మియాపూర్ ఏసీపీ పునాటి నరసింహరావుకు అత్యత్తమ పురస్కారం లభించింది.

Update: 2024-08-17 14:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాదులోని మియాపూర్ ఏసీపీ పునాటి నరసింహరావుకు అత్యత్తమ పురస్కారం లభించింది. ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికయిన పునాటి.. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మెడల్‌ను అందుకున్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోకి 1995లో ఎస్సైగా విధుల్లో చేరిన నరసింహరావు 2021లో ఏసీపీగా పదోన్నతి పొంది ప్రస్తుతం మియాపూర్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎంతో ధైర్య సాహసాలతో సమర్థవంతంగా విధులు నిర్వర్థించిన నరసింహరావుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలతోపాటు ఉత్తమ సేవా పతకం సైతం లభించింది. ఇంటిలిజెన్స్ విభాగంలోనూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. తాజాగా ఆయన సేవలకు కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పోలీస్ మెడల్(ఐ.పి.యమ్)కు ఎంపిక చేసింది. ఆగస్ట్ 15న సీఎం రేవంత్ చేతుల మీదుగా మెడల్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ పునాటి నరసింహరావుకు పోలీసు సిబ్బంది ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.


Similar News