Weather Update : తెలంగాణకు రెడ్ అలర్ట్.. రేపు అత్యంత భారీ వర్షాలు..!

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని, ఇది తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ...

Update: 2023-07-24 11:52 GMT

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని, ఇది తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో రేపు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో మంగళవారం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మిగిలిన జిల్లాల్లోనూ మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

అటు ఏపీలోనూ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాలకు భారీ వర్ష సూచనలున్నట్లు తెలిపారు. 

Read More:  హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం.. బిగ్ అలర్ట్ ప్రకటించిన జీహెచ్ఎంసీ

Tags:    

Similar News