'మీజిల్స్, రుబెల్లా వ్యాధులను పూర్తిగా నిర్మూలించాలి'

మీజిల్స్, రుబెల్లా వ్యాధులను జిల్లాలో పూర్తిగా నిర్మూలించాలని హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వెంకటి అన్నారు.

Update: 2022-11-30 13:53 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: మీజిల్స్, రుబెల్లా వ్యాధులను జిల్లాలో పూర్తిగా నిర్మూలించాలని హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వెంకటి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సీనియర్ పబ్లిక్ హెల్త్ అధికారులకు, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు, మెడికల్ డైరెక్టర్లకు బుధవారం సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో నిర్వహించిన సమావేశానికి డాక్టర్ వెంకటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చర్మంపై దద్దుర్లు, జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలను తప్పనిసరిగా సేకరించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. కొత్తగా క్షయ వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి జిల్లా వైద్యాధికారులకు తెలిపినట్లయితే ఒక్కో కేసుకు రూ. 500 చెల్లిస్తామని తెలిపారు.

జిల్లాలో గర్భస్థ లింగ నిర్ధారిత, నిషేదిత చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని, రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు లేకుండా ఆస్పత్రులు, ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లు నడిపే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యంగా స్కాన్ సెంటర్లు తప్పనిసరిగా ఫారం ఎఫ్‌ ను ప్రతి స్కాన్‌కు నింపాలని, అట్టి ఫారం ఎఫ్ లను సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమర్పించాలని ఆదేశించారు. కొత్త ఏఆర్టీ చట్టాన్ని, ఎంటీపీ చట్టంపై ఆస్పత్రుల యాజమాన్యాలకు పూర్తి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి మురారి, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ దయాల్ సింగ్, తానా సెక్రటరీ డాక్టర్ చారి, డాక్టర్ శ్రీకృష్ణ, దాక్టర్ సుదామాధవి, సీనియర్ పబ్లిక్ హెల్త్ అధికారులు, మాస్ మీడియా అధికారులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

READ MORE

ధరణి పోర్టల్ తక్షణమే రద్దు చేయాలి: పట్లోళ్ల సంజీవరెడ్డి డిమాండ్ 

Tags:    

Similar News