బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో భారీ అగ్నిప్రమాదం

పాతబస్తీ లాల్‌దర్వాజా మోడ్‌లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటన మొఘల్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Update: 2023-11-13 07:01 GMT

దిశ, చార్మినార్ : పాతబస్తీ లాల్‌దర్వాజా మోడ్‌లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటన మొఘల్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మొఘల్‌పుర ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ లాల్‌దర్వాజా మోడ్‌లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో సోమవారం తెల్లవారు జామున అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు మొఘల్ పుర పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అప్పటికే బజాజ్ ఎలక్ట్రానిక్స్ బిల్డింగ్‌లోని మూడు, నాలుగవ అంతస్థులలో మంటలు వేగంగా విస్తరించాయి.

ఆరు ఫైర్ ఇంజన్‌ల ద్వారా అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 3, 4 వ అంతస్థులలోని ఫ్రిజ్, టీవిలతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభావించిందా? లేక బాణా సంచాల కారణంగా అగ్ని ప్రమాదం సంబంధించిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి నష్టం కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా ఈ ఘటన పై ఎలాంటి ఫిర్యాదు అందలేదని మొఘల్‌పుర ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసును మొఘల్ పుర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News