పాతబస్తీలో తనిఖీలకు వెళ్లిన కరెంట్, విజిలెన్స్ అధికారులను నిర్బంధించిన స్థానికులు

హైదరాబాద్ పాతబస్తీలో తనిఖీలకు వెళ్లిన కరెంట్, విజిలెన్స్ అధికారులను స్థానికులు నిర్బంధించారు.

Update: 2024-07-08 06:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పాతబస్తీలో తనిఖీలకు వెళ్లిన కరెంట్, విజిలెన్స్ అధికారులను స్థానికులు నిర్బంధించారు. స్థానికులు పాతబస్తీలో విద్యుత్ బిల్లులు కట్టకుండా ఎగవేత చేస్తుండటంతో మీటర్ల ట్యాంపరింగ్ జరుగుతుందని సమాచారం అందుకున్న విజిలెన్స్, కరెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. దీంతో గుంటల్ షా బాబా దర్గా దగ్గర స్థానికులు విద్యత్, విజిలెన్స్ అధికారులను అడ్డుకున్నారు. అధికారులను నిర్బంధించి విద్యత్ ఛార్జీల వసూలు ప్రైవేట్ కంపెనీలకు ఎలా ఇస్తారని నిలదీసి రిపోర్టులను చింపేశారు. సాకులు చెబుతూ తనిఖీలకు వస్తే ఊరుకోమని స్థానికులు హెచ్చరించారు.


Similar News