గచ్చిబౌలి క్లౌడ్ నైన్ కిచెన్ లో తెగిపడిన లిఫ్ట్...నలుగురు యువకులకు తీవ్ర గాయాలు

లిఫ్ట్ వైర్లు తెగిపోవడంతో 5వ అంతస్తు నుంచి లిఫ్ట్ కింద పడి, అందులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు అయిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-12-20 10:36 GMT

దిశ, శేరిలింగంపల్లి : లిఫ్ట్ వైర్లు తెగిపోవడంతో 5వ అంతస్తు నుంచి లిఫ్ట్ కింద పడి, అందులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు అయిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాల మేరకు… నలుగురు స్నేహితులు కలిసి గురువారం రాత్రి డిన్నర్ చేసేందుకు గాను గచ్చిబౌలిలోని ఓ అపార్టుమెంట్ 5వ అంతస్తులో ఉన్న క్లౌడ్ నైన్ కిచెన్ సిటీ లాంజ్ కు వెళ్లారు. డిన్నర్ అనంతరం వారు తిరిగి వస్తుండగా లిఫ్ట్ లోకి ఎక్కగానే లిఫ్ట్ వైర్లు తెగిపోవడంతో 5వ అంతస్తు నుంచి లిఫ్ట్ ఒక్కసారిగా కిందపడి పోయింది. ఈ ఘటనలో లిఫ్ట్ లో ప్రయాణిస్తున్న నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. సందీప్ (22)అనే యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో పాటు కాలుకు ప్యాక్చర్ అయింది. ప్రస్తుతం వారు ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. సందీప్ తండ్రి సురేందర్ క్లౌడ్ నైన్ కిచెన్ హోటల్ యాజమాన్యం పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News