ప్రపంచ యవనికపై తెలంగాణ టూరిజం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ప్రపంచ పర్యాటక సాంస్కృతిక యవనికపై తెలంగాణ టూరిజం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు... Latest News

Update: 2023-03-07 16:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ పర్యాటక సాంస్కృతిక యవనికపై తెలంగాణ టూరిజం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం బెర్లిన్‌లోని ఇంటర్నేషనల్ టూరిజం అండ్ కల్చర్ ఎగ్జిబిషన్‌లో తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శనకు పెట్టారు. ఈ ప్రదర్శనలో యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయం, బుద్ధవనం, తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ వారి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను తెలంగాణ టూరిజం స్టాల్ వద్ద నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్ లో తెలంగాణ టూరిజం స్టాల్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుందన్నారు. ఈ ఎగ్జిబిషన్ లో 180 దేశాలకు చెందిన పర్యాటక, సాంస్కృతిక సంస్థలు పాల్గొంటున్నాయని మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయన్నారు. వాటికి సరైన ప్రమోషన్ ను కల్పించడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం టూరిజం హబ్ గా ఇప్పటికే పలు టూరిజం సంస్థలు గుర్తించి అవార్డులు అందిస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, జర్మనీలోని భారత రాయబారి పర్వతనేని హరీష్ రావు, ఇండియా టూరిజం సెక్రటరీ అరవింద్ సింగ్, తెలంగాణ టూరిజం ఎండీ మనోహర్, తెలంగాణ అసోసియేషన్ జర్మనీ అధ్యక్షుడు డాక్టర్ రఘు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News