భాగ్య లక్ష్మి అమ్మవారి ఆలయంలో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు

నాంపల్లిలోని బీజేపీ నగర పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యకుడిగా ప్రమాణ స్వీకారానికి ముందు జి. కిషన్​ రెడ్డి చార్మినార్ శ్రీ భాగ్య లక్ష్మి దేవాలయాన్ని శుక్రవారం సందర్శించారు.

Update: 2023-07-21 12:20 GMT

దిశ, చార్మినార్ : నాంపల్లిలోని బీజేపీ నగర పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యకుడిగా ప్రమాణ స్వీకారానికి ముందు జి. కిషన్​ రెడ్డి చార్మినార్ శ్రీ భాగ్య లక్ష్మి దేవాలయాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి తో పాటు బీజేపీ ఎలక్షన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్ రావులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    అనంతరం మహా హారతిలో పాల్గొన్నారు. ఆలయాన్ని సందర్శించిన కిషన్ రెడ్డి తో పాటు బీజేపీ నేతలను ఆలయ ట్రస్టీ చైర్మన్ శశికళ బృందం శాలువాతో ఘనంగా సత్కరించింది. అనంతరం చార్మినార్​ కంటెస్టెడ్​ ఎమ్మెల్యే టి.ఉమామహేంద్ర రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డికి కత్తిని బహూకరించారు. దీంతో కిషన్​ రెడ్డి కత్తితో అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు చింతల రామ చంద్రారెడ్డి, ఎన్ వీ ఎస్ ఎస్ ప్రభాకర్ రావు, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, గౌతమ్ రావోజి, బీజేపీ సీనియర్​ నాయకులు సామ సురేందర్ రెడ్డి, పండు యాదవ్, పాశం సురేందర్, అందెల శ్రీ రాములు యాదవ్, కె.సురేందర్, కునాల్ రావు, ప్రవీన్​ బాడ్గి, ముఖేష్​ పాల్గొన్నారు..

Read more : disha newspaper


Tags:    

Similar News