జీవో నెంబర్ 118 వెరిఫికేషన్ షురూ..

నిషేధిత జాబితాలో ఉన్న ఇండ్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 118 దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రారంభమైందని హయత్ నగర్ మండల తహశీల్దార్ డీ. సంధ్యారాణి రెడ్డి తెలిపారు.

Update: 2023-02-22 14:16 GMT

దిశ, ఎల్బీనగర్: నిషేధిత జాబితాలో ఉన్న ఇండ్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 118 దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రారంభమైందని హయత్ నగర్ మండల తహశీల్దార్ డీ. సంధ్యారాణి రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ మండల పరిధిలో బీఎన్ రెడ్డి నగర్, సాగర్ కాంప్లెక్స్, ఎస్ కేడీ నగర్, వైదేహి నగర్, సిరిపురం కాలనీ, సామానగర్ కాలనీ, విజయనగర్ కాలనీ, సీబీఐ కాలనీ, సాయిరాం నగర్ కాలనీ మొత్తం 9 కాలనీలు జీవో నెంబర్ 118 లో ఉన్నాయన్నారు.

ఆయా కాలనీలలో నిషేధిత జాబితాలో ఇండ్లు నిర్మించుకున్న 2,112 మంది 118 జీవో కింద దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దరఖాస్తుదారుల వెరిఫికేషన్ కోసం వివిధ శాఖలకు చెందిన 12 బృందాల అధికారులు, రెవిన్యూ సిబ్బందిని ప్రభుత్వం నియమించిందని వెల్లడించారు. దరఖాస్తుల పరిశీలనకు వచ్చే అధికారులకు దరఖాస్తుదారులు అన్ని ఆధారాలను సమర్పించాలని కోరారు. ఇప్పటికే 1000 గజాల లోపు నిర్మాణం పూర్తయిన ఇండ్లకు మాత్రమే 118 జీవో వర్తిస్తుందని తెలిపారు.

నిషేధిత జాబితాలో ఆయా కాలనీలలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారు ఎవరైనా ఇంకా మిగిలి ఉంటే కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, ప్రాపర్టీ టాక్స్ లను జత చేసి మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ సంధ్యారాణి రెడ్డి కోరారు.

Tags:    

Similar News