ఆలయాల అభివృద్ధికి మంత్రి చర్యలు తీసుకోవడం అభినందనీయం..

రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధితో పాటు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అర్చక ఉద్యోగుల సమస్యలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సత్వరమే పరిష్కారం చూపడం పట్ల దేవాదాయ శాఖ అర్చక వెల్ఫేర్ బోర్డు సభ్యుడు,

Update: 2024-10-15 12:09 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో: రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధితో పాటు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అర్చక ఉద్యోగుల సమస్యలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సత్వరమే పరిష్కారం చూపడం పట్ల దేవాదాయ శాఖ అర్చక వెల్ఫేర్ బోర్డు సభ్యుడు, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాండూరి కృష్ణమాచారి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కొండా సురేఖ దేవదాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్న వెంటనే 11 సెకండ్ గ్రేడ్ , 33 మంది జూనియర్ అసిస్టెంట్స్ కి పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఎన్నో సంవత్సరాలుగా ప్రమోషన్స్ కోసం ఎదురుచూస్తున్న వారి కుటుంబాల్లో వెలుగును నింపారని కొనియాడారు. అర్చక ఉద్యోగుల ప్రతి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం కోసమే కాకుండా అతి త్వరలో హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు ఇతర సమస్యలు తీర్చే విధంగా పథకాలు రూపొందించారని అన్నారు. దీనిని అర్చక ఉద్యోగులు అంతా కూడా హర్షిస్తున్నారని పేర్కొన్నారు. అర్చక ఉద్యోగుల ప్రతి సమస్య ఆమె దృష్టికి వెళ్లిన వెంటనే పరిష్కరిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఆమె చేపట్టే ప్రతి అభివృద్ధి పనిలో వెన్నంటి ఉంటారని కృష్ణమాచారి తెలిపారు.


Similar News