నా హయాంలో స్టీల్ బ్రిడ్జి రావడం అదృష్టం : MLA Muta Gopal

తన హయాంలో స్టీల్ బ్రిడ్జి రావడం అదృష్టంగా ఉందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.

Update: 2023-08-19 15:38 GMT

దిశ, ముషీరాబాద్ : తన హయాంలో స్టీల్ బ్రిడ్జి రావడం అదృష్టంగా ఉందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రూ. 450 కోట్లతో నిర్మించిన నాయిని నర్సింహారెడ్డి స్టీల్ బ్రిడ్జిని శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సభాధ్యక్షత వహించిన స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.... సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు దూరదృష్టితో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే స్టీల్ బ్రిడ్జి ప్రారంభించడం, పూర్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. తొలి తెలంగాణ హోంమంత్రి, కార్మిక పక్షపాతి నాయిని నర్సింహారెడ్డి పేరును ఈ స్టీల్ బ్రిడ్జికి పెట్టడం

    పట్ల రాష్ట్రంలోని ప్రజలందరూ, కార్మికలోకం హర్షాన్ని వ్యక్తం చేస్తుందని తెలిపారు. స్టీల్ బ్రిడ్జిని ముషీరాబాద్ నియోజకవర్గంలో నిర్మించినందుకుగాను సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జైసింహ, మాజీ కార్పొరేటర్లు వి.శ్రీనివాస్ రెడ్డి, ముఠా పద్మ, నాయిని నర్సింహారెడ్డి తనయుడు నాయిని దేవేందర్ రెడ్డి, కుటుంబసభ్యులు, నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్, పలు డివిజన్ల అధ్యక్షులు వై.శ్రీనివాస్, నర్సింగ్, శ్యామ్ యాదవ్, నాయకులు శ్రీధర్ చారి, కరికె కిరణ్, రాజశేఖర్ గౌడ్, మహ్మద్ ఖదీర్, అహ్మదుల్లా భక్తియారి, రజినికాంత్ గౌడ్, వల్లాల శ్రీనివాస్ యాదవ్, కొండా శ్రీధర్ రెడ్డి, అరుణ్, గడ్డమీది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News