శ్రీ నారాయణతో ఇంటర్ బోర్డు మూలాఖత్

లంగర్ హౌస్ లోని శ్రీ నారాయణ కాలేజీ పై ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేయడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Update: 2024-07-14 15:14 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో : లంగర్ హౌస్ లోని శ్రీ నారాయణ కాలేజీ పై ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేయడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాలేజీ యాజమాన్యంతో ఇంటర్ బోర్డు అధికారులు ములాఖత్ అయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతి లేని కళాశాలను సీజ్ చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

అనుమతి లేకుండానే మూడేళ్లుగా..

లంగర్ హౌస్ లోని శ్రీ నారాయణ కళాశాలను సంబంధిత యాజమాన్యం మూడేళ్లుగా అనుమతులు లేకుండానే నిర్వహించడం వెనుక ఇంటర్ బోర్డు అధికారుల హస్తం ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఇంటర్ బోర్డు అధికారులకు ఈ విషయం తెలియకపోతే వారి పనితీరుపైనా కూడా అనుమానాలు వస్తున్నాయి. శ్రీ నారాయణ కళాశాల యాజమాన్యం మరో కాలేజీ మేనేజ్మెంట్ తో కలిసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. శ్రీ నారాయణ కళాశాల యాజమాన్యం తమ కాలేజీకి అనుమతి లేకపోయినా అడ్మిషన్లు విచ్చలవిడిగా తీసుకుంటున్నారు.

    మరో కళాశాల యాజమాన్యంతో కుమ్మక్కై వారికి డబ్బులు ఇచ్చి సదరు కళాశాల పేరు మీదుగా పరీక్షలు రాయిస్తున్నారు. ఈ వ్యవహారం అంతా ఇంటర్ బోర్డు అధికారులకు తెలిసినా కూడా చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేయడంలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్ బోర్డు అధికారులు సుమారు నెల రోజుల క్రితం తనిఖీలు నిర్వహించి ఇంటర్ బోర్డు కు నివేదిక సమర్పించినా

     కూడా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని అడుగుతున్నారు. ఇంటర్ బోర్డు అధికారులకు శ్రీ నారాయణ కాలేజీ యాజమాన్యానికి మధ్య 'వ్యవహారం' ఏదో జరుగుతుందని అనుమానిస్తున్నారు. ఇంటర్ బోర్డు అధికారులు తక్షణమే కళాశాలను మూసి వేయకపోతే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. శ్రీ నారాయణ కళాశాలతో ములాఖత్ అయి చర్యలు తీసుకోని ఇంటర్ బోర్డు అధికారుల పైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 


Similar News