ఆకట్టుకుంటున్న.. తెలంగాణ పిల్లల జాతర..
సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో పిల్లల 4వ వార్షికోత్సవ బాలోత్సవం జాతరకి విచ్చేసిన చిన్నారుల జానపద, శాస్త్రీయ నృత్యాలు, ఉపన్యాస పోటీలు, చిత్రలేఖనాలు, సైన్స్ ఎగ్జిబిషన్, మట్టి బొమ్మలు మ్యాప్ పాయింటింగ్ , షార్ట్ ఫిల్మ్ ప్రదర్శనలు ఆట, పాటలతో అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
దిశ, రాంనగర్ డివిజన్ : సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో పిల్లల 4వ వార్షికోత్సవ బాలోత్సవం జాతరకి విచ్చేసిన చిన్నారుల జానపద, శాస్త్రీయ నృత్యాలు, ఉపన్యాస పోటీలు, చిత్రలేఖనాలు, సైన్స్ ఎగ్జిబిషన్, మట్టి బొమ్మలు మ్యాప్ పాయింటింగ్ , షార్ట్ ఫిల్మ్ ప్రదర్శనలు ఆట, పాటలతో అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. జాతరలో పాల్గొన్న చిన్నారులు ఆనందం వ్యక్తం చేస్తూ వారి వారి ప్రతిభను ఉత్సాహంగా కనబరుస్తున్నారు. రేపటి వరకు నిర్వహించే బాలోత్సవం పిల్లల జాతరలో పాల్గొనే సీనియర్, జూనియర్ బాల బాలికలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు.