కంటోన్మెంట్ లో గ'లీజు' దందా!

రక్షణ శాఖ భూముల్లో అక్రమ వ్యాపారం జోరుగా సాగుతున్నది.

Update: 2022-12-14 02:22 GMT

దిశ, కంటోన్మెంట్: రక్షణ శాఖ భూముల్లో అక్రమ వ్యాపారం జోరుగా సాగుతున్నది. లీజుల పేరిట విలువైన స్థలాలను తమ గుప్పిట్లో ఉంచుకుని అక్రమంగా రూ. కోట్లు గడిస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ దందా యథేచ్ఛగా సాగుతున్నా.. బడాబాబులు జోలికి వెళ్లేందుకు అధికార యంత్రాంగం జంకుతున్నది. కొన్ని బంగ్లాలో గుట్టు చప్పుడు కాకుండా అక్రమ నిర్మాణాలను సాగిస్తున్నారు. బీ3 బంగ్లాలో ముందు గేట్లు ఏర్పాటు చేసి ఇతరులేవరిని లోపలికి అనుమతించుకుండా పెద్ద ఎత్తున అక్ర మంగా షెడ్లు, భవనాలను నిర్మిస్తున్నారు. అక్రమణాల ను అరికట్టాల్సిన కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగం మీనవేషాలు లెక్కిస్తున్నారు.

అక్రమంగా వ్యాపార లావాదేవీలు

కంటోన్మెంట్‌లో ఉన్న 113 ఓల్డ్ గ్రాంట్స్ బంగ్లాలలో పెద్ద ఎత్తున అక్రమంగా వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. కంటోన్మెంట్ బోర్డు తమ ఖజానను నింపుకోవాలనే ఉద్దేశంతో.. బీ3 బంగ్లాలలోని అక్రమ వ్యాపారాలకు ఇటీవల ట్రేడ్ లైసెన్సు జారీ చేస్తున్నది. అయితే ఒక వ్యక్తి వ్యాపారాన్ని స్థాపించాలంటే ట్రేడ్ లైసెన్స్, వృత్తి లైసెన్స్‌ను వాణిజ్య పన్నుల శాఖ, వ్యాపారం నిర్వహించే చోట లోకల్ బాడీ అధికారుల నుంచి తీసుకోవాలి. ఇందుకోసం దుకాణం ఏర్పాటు చేసే భవన యజమాని ఆమోదంతో లీజ్ అగ్రిమెంట్, ఐడెంటిఫికేషన్ ఫ్రూప్ సమర్పించాలి. నిబంధనల ప్రకారం ఇవేమీ సమర్పించకుండానే ట్రేడర్స్ వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుండడం గమనార్హం. ఉదాహరణకు నందమూరినగర్‌లోని బీ3, 181 ఓల్డ్ గ్రాంట్ బంగ్లాను 99 ఏళ్ల పాటు లీజుకు రక్షణ శాఖ బద్రివిశాల్‌కు ఇచ్చింది. బద్రివిశాల్ నుంచి సబ్ లీజుకు మాజీ ఎమ్మెల్సీ కను కుల జనార్దన్‌రెడ్డి తీసుకున్నట్లు సమాచారం. అయను ఆ బంగ్లాను తన కుమార్తెలకు నజరానగా ఇచ్చినట్లు తెలిసింది. ఈ బంగ్లాలో కార్నివాల్ బిజినెస్ పేరిట జనా ర్దన్‌రెడ్డి కోడలు కనుకుల అనమిక‌రెడ్డి, మరో మహిళ మౌనిక వర్దన్‌లు దరఖాస్తు చేశారు. అయితే వారు తప్పుడు అడ్రస్‌లను సమర్పించినా, కంటోన్మెంట్ బోర్డు ఇవేమి పరిశీలించకుండా గుడ్డిగా ట్రేడ్ లైసెన్స్‌లు జారీ చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు 181 ఓల్డ్ గ్రాంట్ బంగ్లాల బద్రివిశాల్ లీజుదారుడు, రక్షణ మంత్రిత్వ శాఖ యజమాని, అయితే కంటోన్మెం ట్ బోర్డు ట్రేడ్ సదరు బంగ్లాలోని వ్యాపారానికి లైసె న్స్‌ను ఇచ్చేటప్పుడు బంగ్లా యాజమాని ఎవరిని పరిగణించిందో.. లీజుదారుడి స్థానాన్ని ఎవరికిచ్చిందో అధి కార యంత్రాంగానికే తెలియాలి. ఇలాంటి తప్పులనే బోర్డు యంత్రాంగం కంటోన్మెంట్ వ్యాప్తంగా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిర్ణయాలే తప్ప చర్యలు లేవు

బీ3 బంగ్లాల లీజు రద్దు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని గతంలో జరిగిన పలు బోర్డు మీటింగ్‌ల‌లో పాలకమండలి సభ్యులు నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక ఎంపీ రేవంత్‌రెడ్డి సైతం 2019, ఆగస్టు 9న జరిగిన బోర్డు మీటింగ్‌లో అక్రమ వ్యాపారం చేస్తున్న బీ3 లీజు బంగ్లాల రద్దుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సూ చించారు. దీనిపై స్పందించిన అప్పటి కల్నల్ క్యూ తరు ణేశ్ అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న 36 ఓల్డ్ గ్రాంట్ బంగ్లాలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర రక్షన మంత్రి త్వ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక అంజేసినట్లు తెలిపారు. అయితే కల్నల్ క్యూ సమర్పించిన ఆ36 ఓల్డ్ గ్రాంట్ బంగ్లాలపై ఇప్పటి వరకు చర్యలు తీసు కున్న దాఖాల్లేవ్. రక్షణ శాఖ ఉదాసీనత, స్థానిక బోర్డు అధికారుల అలసత్వం వల్ల ఓల్డ్ గ్రాంట్ బంగ్లాలలో అక్రమ వ్యాపార కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.

అనధికారికంగా ఫంక్షన్ హాళ్లు, విద్యాసంస్థలు

వాణిజ్య పరమైన కార్యకాలాపాలను నిర్వహించరాదని నిబంధనలు ఉన్నప్పటికీ, కొంత మంది ప్రజా ప్రతినిధులు, బడాబాబులు ఈ బంగ్లాల్లో కల్యాణ మండపాలను నిర్మించారు. నామామాత్రపు లీజులు చెల్లిస్తున్న పలువురు లీజుదారులు.. ఒక్కో కల్యాణ మండపంలో పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు అద్దెల రూపంలో రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు సైతం బంగ్లాలలో నిబంధనలకు విరుద్ధంగా కల్యాణ మండపాలు, ఇతర వాణిజ్యభవనాలను నిర్మించి వ్యాపా రం చేసుకోవం గమనార్హం. లీజు గడువు ముగిసినప్పటికీ, ఇంపిరీయల్, క్లాసిక్, అగ్రసేన్, కేజేఆర్, వైశ్రాయ్, లీ ఫ్యాలెస్, బాంటియా, మల్లారెడ్డి, మిలీనియం తదితర బీ 3 బంగళాల వంటి గార్డెన్స్ ఈ కోవలో చెందినవే. టీవోలి గార్డెన్స్, ఢిల్లీ పబ్లీక్ స్కూల్ వంటివి కూడా లీజులో ఉన్న రక్షణ శాఖ భూములే. వీటిలో రూ.కోట్లలో వ్యాపార కార్యకలాపాలు నడుస్తున్నా.. బోర్డుకు లక్షల్లో కూడా ఆదాయం సమాకూరడంలేదని ఓ అధికారి వాపోయారు. ఇప్పటికైనా కొత్తగా బోర్డు సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన మధుకర్ నాయక్ బీ 3 బంగ్లాలో కొనసాగుతున్న అక్రమ వ్యాపారాలు, నిర్మాణాలపై ఏ చర్యలు తీసుకుంటారో చూడాలి.

Read More...

ప్రజల అసంతృప్తిపై కేసీఆర్ సర్వే.. వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏంటీ..! 

Tags:    

Similar News