మహిళలను వేధిస్తే కఠిన చర్యలు: రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్

మహిళలను వేధించే ఆకతాయిలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు.

Update: 2023-02-09 16:06 GMT

దిశ, ఎల్బీనగర్: మహిళలను వేధించే ఆకతాయిలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. గురువారం షీ టీంల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈవ్ టీజర్ల కౌన్సిలింగ్ కార్యక్రమంలో కమిషనర్ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళల భద్రత కోసం పోలీసులు షీ టీంల ద్వారా ఎన్నో కార్య్రమాలను నిర్వహిస్తున్నారని, ఆకతాయిలకు కౌన్సిలింగ్ ద్వారా వారి చెడు ప్రవర్తనలో మార్చు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పురుషులు ఆడవారి పట్ల బాధ్యతగా, మర్యాదగా నడుచుకోవాలని, వారికి అండగా నిలవాలని అన్నారు. షీ టీంలు గడిచిన రెండు నెలల కాలంలో ఈవ్ టీజర్ల మీద 118 కేసులు నమోదు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్డు సేఫ్టీ డీసీపీ శ్రీ బాల, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News