అంబర్ పేట బీఆర్ఎస్ లో గ్రూపు రాజకీయాలు..

అంబర్ పేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీలో గ్రూపు రాజకీయాలతో క్యాడర్ అయోమయానికి గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Update: 2023-06-07 16:25 GMT

దిశ, నల్లకుంట : అంబర్ పేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీలో గ్రూపు రాజకీయాలతో క్యాడర్ అయోమయానికి గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ వర్సెస్ పార్టీ ఇంచార్జి ఎడ్ల సుధాకర్ రెడ్డి, గోల్నాక కార్పొరేటర్ భర్త దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, మాజీ కార్పొరేటర్ భర్త గరిగంటి రమేష్, పద్మావతి డిపి రెడ్డి, పులి జగన్, డాక్టర్ సులోచనలు రెండు గ్రూపులుగా విడిపోయి పార్టీని పరేషాన్ లోకి నెట్ వేస్తున్నారని పలువురు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యే పై సొంత పార్టీ నేతలు బహిరంగంగా విమర్శలు చేయడంతో చర్చనీయంగా మారింది. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీగెలుపు కష్టమే అని పలువురు అంటున్నారు.

ఇంచార్జ్ ఎడ్ల సుధాకర్ రెడ్డి వర్గం నాయకులు నియోజకవర్గ పరిధిలోని ఆయా ప్రధాన కూడలిలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, హరీష్ రావుల ఫోటోలతో పాటు సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలను ఫ్లెక్సీల పెడితే ఎమ్మెల్యే వర్గం చించేపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఒక పక్క అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో మరోపక్క వర్గపోరుతో నాయకులు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకోవడంతో పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురిచేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న చోటమోటా నాయకులు వర్గపోరుతో ఎవరి వైపు ఉండాలో అర్థం కాక సతమతమవుతున్నామని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ హై కమాండ్ రంగంలోకి దిగి చక్కదితకపోతే చేతులారా ఒక ఎమ్మెల్యే కోల్పోతామని పలువురు వాపోతున్నారు. బీఆర్ఎస్ వర్గపోరు కారణంగా బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని పలువురు రాజకీయ మేధావులు చెబుతున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో కాచిగూడ, బాగ్ అంబర్ పేట, నల్లకుంట డివిజన్లో బీజేపీ కార్పొరేటర్లుగా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ అధిష్టాన వర్గం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News