శివరాత్రి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

పీఆర్సీ ఇచ్చే విషయం సీఎం కేసీఆర్ దృష్టిలో ఉందని, త్వరలోనే పీఆర్సీని ప్రకటిస్తామని ట్రాన్స్‌కో... Good News for Employees

Update: 2023-02-16 14:14 GMT

దిశ, ముషీరాబాద్: పీఆర్సీ ఇచ్చే విషయం సీఎం కేసీఆర్ దృష్టిలో ఉందని, త్వరలోనే పీఆర్సీని ప్రకటిస్తామని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. తెలంగాణ ఎలక్ట్రసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ 13 వ వార్షికోత్సవ వేడుకలు, డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అందరి కృషి, సహకారంతోనే 24 గంటల పాటు ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అందజేయడం జరుగుతుందన్నారు. దేశంలోనే ఎన్నో అవార్డులను తీసుకుని వినియోగదారులకు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. పీఆర్సీ విషయంలో ఎక్కువగా ఆశించకండి... ఇప్పుడే మంచి జీతాలు ఉన్నాయి...వచ్చిన దానికి సంతృప్తి పడండి అని ఉద్యోగులకు ఆయన సూచించారు. ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ పరంగా దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు. 37 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టామని తెలిపారు. సాంకేతికపరంగా బాగా ఉన్నామని, కానీ దానిని ఆర్థికపరంగా మార్చుకోలేకపోతున్నామన్నారు. బెస్ట్ జెన్కో 73 శాతం కాగా, ట్రాన్స్మిషన్ అవైలబిలిటీ 99. 99 శాతం ఉందన్నారు. విద్యుత్ అందించడంలో సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించిన ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. ట్రాన్స్‌కో, జెన్‌కో ఆదాయాలు పెంచే దిశగా సిబ్బంది, అధికారులు నిర్మాణాత్మకంగా పని చేయాలన్నారు. అన్ని సక్రమంగా జరిగితే పీఆర్సీ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. మీవి న్యాయబద్ధమైన కోరికలను పరిష్కరించదగ్గయన్నారు. అసోసియేషన్ వ్యవస్థాపకులు, సెక్రెటరీ జనరల్ మాతంగి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుమా రెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ తదితరులు హాజరై మాట్లాడారు. 

Tags:    

Similar News