Hyderabad to Tirupati :తిరుపతి వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాచిగూడ-తిరుపతి, తిరుపతి-కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది.
దిశ, మెట్టుగూడ: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాచిగూడ-తిరుపతి, తిరుపతి-కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. Train No.07473: కాచిగూడ-తిరుపతి మధ్య డిసెంబర్ 4 తేదీన నడపనుంది. ఆదివారం 17.20 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి.. మరుసటి రోజు 07.20 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు మల్కాజ్ గిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట తదితర స్టేషన్‌లో ఆగుతుంది.
Train No.07474 తిరుపతి-కాచిగూడ మధ్య డిసెంబర్ 5వ తేదీన నడపనుంది. సోమవారం రాత్రి 20.15 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఆదివారం 9 గంటలకు కాచిగూడ చేరుతుంది. ఈ ప్రత్యేక రైలు రేణిగుంట, గూడూరు,నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగాం, మల్కాజ్గిరి తదితర స్టేషన్‌లలో ఆగుతుంది. ఈ రైళ్లలో ఏసీ 2 టైర్, స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని అధికారులు తెలిపారు.
Read more:
జనవరిలో Tirumala వెళ్తున్నారా?... ఈ విషయం తెలుసుకోవాల్సిందే...!