- ఆరుగురు కో –చైర్మన్లు
- 9 మంది అడ్వైజరీ కమిటీ
- 37 మందితో టీమ్
దిశ, తెలంగాణ బ్యూరో: ఓబీసీ డిక్లరేషన్ చైర్మన్‌గా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు ఆరుగురు కో చైర్మన్లను , 9 మంది అడ్వైజరీ కమిటీ, మరో 37 మందితో టీమ్‌ను ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 50 శాతం బీసీ వర్గాలను కాంగ్రెస్ వైపు తిప్పుకునేలా డిక్లరేషన్ ఉంటుందన్నారు. బలహీన వర్గాలకు మేలు జరిగేలా అంశాలను రూపకల్పన చేయనున్నట్లు చెప్పారు. పబ్లిక్‌తో పాటు వివిధ రంగాల్లోని నిపుణుల సలహాలు, సూచనలు తీసుకొని డిక్లరేషన్ అంశాలపై అధ్యయనం జరుగుతుందన్నారు. త్వరలో బీసీ డిక్లరేషన్ సభపై తేదీని ఫిక్స్ చేయనున్నట్లు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.