Former bureaucrat Balalatha : దివ్యాంగుల పై చేసిన వ్యాఖ్యలను స్మిత సబర్వాల్ వెనక్కి తీసుకోవాలి..

సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మిత సబర్వాల్ దివ్యాంగుల పై చేసిన వ్యాఖ్యలను మాజీ బ్యూరోక్రాట్ బాలలత ఖండించారు.

Update: 2024-07-22 11:26 GMT

దిశ, ఖైరతాబాద్ : సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మిత సబర్వాల్ దివ్యాంగుల పై చేసిన వ్యాఖ్యలను మాజీ బ్యూరోక్రాట్ బాలలత ఖండించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంగవైకల్యం ఉన్నవారి గురించి మాట్లాడటానికి స్మిత సభర్వాల్ కు ఉన్న అర్హత ఏంటో చెప్పాలి అని ప్రశ్నించారు. జ్యుడీషియరీ, పార్లమెంటరీ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది అని అన్నారు. అసలు ఫీల్డ్ లో పరిగెత్తుతూ స్మిత సబర్వాల్ ఎంతకాలం పనిచేసింది అన్నారు. వివక్షకు గురవుతున్న వికలాంగులను స్మిత సబర్వాల్ మాటలు మరింత కుంగదీసాయన్నారు. సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి మొదటి అపాయింట్మెంట్ వికలాంగురాలికి ఇచ్చారు. కానీ స్మిత తన మాటలు వ్యక్తిగతంగా మాట్లాడుతుందా.. ప్రభుత్వం తరపున మాట్లాడుతుందా అనేది తేల్చాలి అని అన్నారు.

కోడ్ ఆఫ్ కండెక్ట్, సివిల్ సర్వీసెస్ క్రమశిక్షణ రాహిత్యం కింద స్మిత సబర్వాల్ పైన చర్యలు తీసుకోవాలన్నారు. అంగవైకల్యం ఉన్న జైపాల్ రెడ్డి ఉత్తమ పార్లమెంటరీ సాధించారు అని గుర్తుచేశారు. స్మిత సబర్వాల్ పైన చర్యలు తీసుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఇప్పటికైనా సివిల్స్ పరీక్ష రాస్తాను.. నాకన్నా ఎక్కువ మార్కులు సాధించమని స్మిత సబర్వాల్ కు సవాల్ చేశారు. స్టీఫెన్ హాకింగ్, సుధా చంద్రన్ వంటి మేధావులు అంగవైకల్యం జయించారు అన్నారు. కేసీఆర్ హయాంలో పదేళ్ల పాటు సీఎంఓలో పనిచేసి కనీసం అడ్మినిస్ట్రేషన్ పైన అవగాహన లేకుండా మాట్లాడటం బాధాకరం అన్నారు. అంగవైకల్యంతో పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు తీసుకున్న వారు ఉన్నారు. 24 గంటల్లో స్మిత సభర్వాల్ తన మాటలు వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. రేపటి లోగా ప్రభుత్వం ఈ అంశం పైన రియాక్ట్ అవ్వకపోతే ట్యాంక్ బండ్ పైన నిరసన దీక్ష చేపడుతాం అన్నారు.

Tags:    

Similar News