నగరంలో మళ్లీ ఫ్లెక్సీలు..! వైరల్ అవుతున్న ఫొటోలు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మద్దతు పలుకుతూ...Flexis at Hyderabad
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మద్దతు పలుకుతూ హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో కవిత ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. 'డాటర్ ఆఫ్ ఫైటర్ విల్ నెవర్ ఫియర్', తెలంగాణ గడ్డ కేసీఆర్ అడ్డా వీఆర్ విత్ యూ కవితక్క అంటూ నినాదాలతో ఫ్లెక్సీలను ప్రచురించారు. అంతేకాకుండా, తెలంగాణకు సీఎం కేసీఆరే శ్రీరామరక్ష, తెలంగాణ గడ్డ కేసీఆర్ అడ్డా అని వాటిలో పేర్కొన్నారు. ఈ ఫ్లెక్సీలలో కేవలం కేసీఆర్, కవిత ఫొటోలు మాత్రమే ఉండడం ఆసక్తికరంగా మారింది. అరవింద్ అలిశెట్టి పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీబీఐ నోటీసులు జారీ చేసిన సంఘటన తెలిసిందే. డిసెంబర్ 6వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని..హైదరాబాద్ లేదా ఢిల్లీలో ఎక్కడ అందుబాటులో ఉంటారో తెలియజేయమని కోరగా కవిత హైదరాబాదులో విచారణ హాజరవుతానని ముందు సీబీఐ అధికారులకు రిప్లై ఇచ్చారు. అయితే, తెలివిగా ఆమె కేసు కాపీలను కోరి అవి వచ్చిన తర్వాతే తాను ఎప్పుడు విచారణకు హాజరవుతాను అనే విషయాన్ని చెబుతాను అనడం గురించి ఇప్పుడు తెలంగాణ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.