ఊరేగింపునకే వన్నె తెచ్చే మీరాలం మండి అమ్మవారి ఘటాల జాతర..

భాగ్యనగర్​ శ్రీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాల ఉమ్మడి దేవాలయాలు ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన జరుగనున్న పాతబస్తీ బోనాల ఘటాల సామూహిక నిమజ్జన ఊరేగింపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య తెలిపారు.

Update: 2024-07-28 17:29 GMT

దిశ, చార్మినార్​ : భాగ్యనగర్​ శ్రీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాల ఉమ్మడి దేవాలయాలు ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన జరుగనున్న పాతబస్తీ బోనాల ఘటాల సామూహిక నిమజ్జన ఊరేగింపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య తెలిపారు. మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయ అమ్మవారి ఘటం వెంట విభిన్న రూపాలలో భారీ శకటాలు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. పాతబస్తీలో ఈ ఏడాది బోనాల ఉత్సవాల సందర్భంగా కేవలం 56 మాత్రమే చిన్న, పెద్ద డిజిటల్​ స్వాగత వేదికలు మంజూరయితే, 69 స్వాగత వేదికలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ యేడు నిర్వహించే సామూహిక బోనాల జాతరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, విజయవాడ, శ్రీకాకుళం, రాజమండ్రి, ఖమ్మం, వరంగల్​,విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి 400 మంది కళాకారులు జాతరలో ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. బ్యాండు మేళాలు.. డప్పు వాయిద్యాల నడుమ ... అమ్మవారి సామూహిక ఘటం నిమజ్జనం ఊరేగింపు ముందుకు సాగుతుందన్నారు. భాగ్యనగర్​ శ్రీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాల ఉమ్మడి దేవాలయాలు ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో చారిత్రాత్మక చార్మినార్​ వద్ద ఏర్పాటుచేసిన స్వాగత వేదిక వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంఎల్​సిలతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు. లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని, పోలీసులు కూడా ఉమ్మడి కమిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News