సైబర్​ నేరాల బారిన పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండండి : డీసీపీ

సైబర్​ నేరాలపై విద్యార్థినిలు, మహిళలు అవగాహన పెంచుకోవాలని ఆకతాయిలు వేధిస్తే వెంటనే షీటీంలకు సమాచారం అందించాలని సౌత్​జోన్​ డీసీపీ స్నేహ మెహ్రా అన్నారు.

Update: 2024-11-08 15:36 GMT

దిశ, చార్మినార్: ​సైబర్​ నేరాలపై విద్యార్థినిలు, మహిళలు అవగాహన పెంచుకోవాలని ఆకతాయిలు వేధిస్తే వెంటనే షీటీంలకు సమాచారం అందించాలని సౌత్​జోన్​ డీసీపీ స్నేహ మెహ్రా అన్నారు. మహిళలు, పిల్లలను టార్గెట్​ చేసుకుని సైబర్​ నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా మహిళల రక్షణకు చట్టాలు, సైబర్​ నేరాలు, గుడ్​ టచ్​, బ్యాడ్​ టచ్​ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. శుక్రవారం ఇంజన్​బౌళి లోని ప్రోగ్రెస్​ స్కూల్​ లో ఫలక్​నుమా ఇన్​స్పెక్టర్​ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సైబర్ క్రైమ్ మోసాలు, మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న నేరాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు సౌత్​జోన్​ డీసీపీ స్నేహ మెహ్రా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ.. బాలికలు, మహిళలు అపరిచిత వ్యక్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఏదైనా ఘటన జరిగినా మౌనం వీడి నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. షీటీమ్​ ప్రాముఖ్యత, ఫోక్సో చట్టాలు, ఈవ్​ టీజింగ్​, గుడ్​ టచ్​, బ్యాడ్​ టచ్, మహిళలు గృహహింస, వరకట్నం గురించి శారీరకంగా, మానసికంగా హింసించే తదితర అంశాల గురించి క్లుప్తంగా వివరించారు.

యువత ఇంటర్నెట్​ పరిమితికి మించి వాడకూడదని, సైబర్​ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి డబ్బులను కాజేస్తున్నారన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు మీకు ఫోన్​ చేసి మీ ఏటీఎం, పిన్​ నెంబర్​, సీవీ ఏ బ్యాంకు ఖాతా తదితర వివరాలు కోరితే ఇవ్వరాదన్నారు. ఎవరైనా మీకు లాటరీ తగిలింది. కొంత డబ్బు సూచించిన బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ఫోన్​ కాల్​ వచ్చినా , ఏ విధంగా అయినా మీరు మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బును కోల్పోతే వెంటనే స్థానిక పోలీస్​ స్టేషన్​ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే సైబర్​ నేరాలకు గురైనప్పుడు 1930 టోల్​ ఫ్రీ నెంబర్​కు డయల్​ చేయాలన్నారు. సైబర్​ నేరాల బారిన పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ షేక్​ జహంగీర్​, ఫలక్​ నుమా ఏసీపీ ఎం.ఎ జావిద్​, ఛత్రినాక ఏసీపీ చంద్రశేఖర్​, షీటీం డీఎస్పీ ప్రసన్న లక్ష్మి, షీ టీం ఇన్​స్పెక్టర్​ ధన లక్ష్మి, సైబర్​ క్రైం ఇన్​స్పెక్టర్​ నరేష్. తదితరులు పాల్గొన్నారు.


Similar News