'ప్రతి విద్యార్థి నిత్యం యోగ చేయాలి'

విద్యార్థులు యోగ చేయాలని, యోగ చేయడం వల్ల విద్యార్థుల తెలివితేటలు మరింత మెరుగవుతాయని తెలంగాణ రాష్ట్ర లోకాయుక్త జస్టిస్‌ సివి. రాములు అన్నారు.

Update: 2023-08-06 14:46 GMT

దిశ, ముషీరాబాద్: విద్యార్థులు యోగ చేయాలని, యోగ చేయడం వల్ల విద్యార్థుల తెలివితేటలు మరింత మెరుగవుతాయని తెలంగాణ రాష్ట్ర లోకాయుక్త జస్టిస్‌ సివి. రాములు అన్నారు. రాష్ట్ర వీర శైవ లింగాయత్, లింగ బలిజ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో ఎస్ఎస్సీ విద్యార్థులకు ప్రతిభా పురస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర లోకాయుక్త జస్టిస్‌ సివి. రాములు, మాజీ ఎంపీ సురేష్ షట్కర్‌లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా 125 విద్యార్థులకు ప్రతిభ పురస్కార్ అవార్డులను అందచేశారు. ఈ సందర్భంగా సివి. రాములు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలన్నారు. ప్రతి విద్యార్థి నిత్యం యోగ చేయాలన్నారు. వీర శైవ లింగాయత్, లింగ బలిజ సంఘం బలంగా ఉండాలన్నారు. వీర శైవ లింగాయత్, లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వీర శైవ లింగాయత్, లింగ బలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నె ఈశ్వరప్ప, గౌరవాధ్యక్షుడు సంగమేశ్వర్, యువత విభాగం అధ్యక్షుడు కలపల్లి రాజప్ప, ప్రధాన కార్యదర్శి భరత్, సంఘం రాష్ట్ర సెక్రటరి జనరల్ శెట్టి శివ కుమార్, కోశాధికారి దినేష్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు శివ శరణ్ లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లింగాయత్‌లు పెద్ద ఎత్తున హాజరయ్యారు.


Similar News