Collector Anudeep Durishetti : ప్రతి దరఖాస్తుకు సత్వరమే పరిష్కారం చూపాలి

సమస్యలపై కార్యాలయానికి వచ్చే ప్రతి దరఖాస్తుకు సత్వర పరిష్కారం చూపాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తహసీల్దార్లను ఆదేశించారు.

Update: 2024-08-03 11:35 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో : సమస్యలపై కార్యాలయానికి వచ్చే ప్రతి దరఖాస్తుకు సత్వర పరిష్కారం చూపాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తహసీల్దార్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీఓలు,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, వివిధ సెక్షన్స్ పర్యవేక్షకులతో నిర్వహించిన రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొని వివిధ అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ప్రతి దరఖాస్తును

    ఇన్ వార్డులో తేదీ వారీగా నమోదు చేసి అదే రోజు సంబంధిత సెక్షన్లకు అందజేయాలని సూచించారు. ప్రజా పాలన సేవా కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, గ్యాస్, ఎలక్ట్రిసిటీ వంటి సమస్యలపై సత్వరమే స్పందించాలని అన్నారు. సీఎంఓ, ప్రజావాణి, మీసేవ దరఖాస్తులపై దృష్టి సారించాలని , మీ సేవా డాష్ బోర్డ్ లో పెండెన్సీ లేకుండా చూడాలని అన్నారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భవనాలు, భూములను గుర్తించాలని , కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ( రెవెన్యూ) వెంకటాచారి, ఆర్డీవోలు మహిపాల్, దశరథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News