రాష్ట్రంలో నెంబర్ వన్ జిల్లాగా తీర్చిదిద్దాలి: అదనపు కలెక్టర్

దిశ, హైదరాబాద్ బ్యూరో: జిల్లాలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించాలని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వెంకటాచారి అధికారులను ఆదేశించారు.

Update: 2024-08-29 12:52 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో: జిల్లాలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించాలని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వెంకటాచారి అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ రాష్ట్రంలో నెంబర్ వన్ జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఆర్డిఓలు,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, వివిధ సెక్షన్స్ పర్యవేక్షకులతో నిర్వహించిన రెవిన్యూ అధికారుల కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు . ఈ సందర్భంగా ల్యాండ్ బ్యాంక్, పి ఓ బి, ప్రభుత్వ భూముల కేటాయింపులు, మూసి నది ఆక్రమణలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ఎన్ఓసి బిల్డింగ్ అనుమతులు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, వాల్టా చట్టం, మీసేవ ధృవపత్రాలు, ఆసరా పెన్షన్లు, సీఎం ఓ ప్రజావాణి, కలెక్టర్ ప్రజావాణి తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలన్నారు . సీఎంఓ, ప్రజావాణి, మీసేవ దరఖాస్తులన్నీ వెను వెంటనే పరిష్కారం చేయాలని, మీ సేవా డాష్ బోర్డ్ లో పెండింగ్స్ లేకుండా చూడాలన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో ఆర్డీవోలు జ్యోతి, దశరథ్ సింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.


Similar News