సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు
దిశ చైతన్య పురి : నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. మంగళవారం చంపాపేట డివిజన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో రూ. 36 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీరోడ్డును ప్రారంబించి మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. అనంతరం డిఫెన్స్ కాలనీలో నిర్మిస్తున్న కమ్యూనిటి హాల్ పనులను పరిశీలించారు. ఈకార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ముడుపు రాజిరెడ్డి, మహిళ అధ్యక్షురాలు రోజారెడ్డి, నాయకులు సుంకోజు కృష్ణమాచారి, సదానంద్ రెడ్డి, కాలనీవాసులు జైపాల్ రెడ్డి, సురేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కృష్ణరెడ్డి, రాము, బాలరాజు, భాస్కర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, మల్లేష్ గౌడ్, అంజిరెడ్డి, బెనర్జీ, యాదగిరి, బొంబాయి, రమాదేవి, ఉమ మహేశ్వర్, రాజు, వసంత తదితరులు పాల్గొన్నారు.