రేపే బీసీ కమిషన్ విచారణ.. వివరాలు వెల్లడించిన డీఆర్వో..

వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజల స్థితిగతులు తెలుసుకునేందుకు బీసీ కమిషన్ శనివారం నిర్వహించే బహిరంగ విచారణ కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఈ వెంకటాచారి సూచించారు.

Update: 2024-11-22 14:35 GMT

దిశ , హైదరాబాద్ బ్యూరో : వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజల స్థితిగతులు తెలుసుకునేందుకు బీసీ కమిషన్ శనివారం నిర్వహించే బహిరంగ విచారణ కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఈ వెంకటాచారి సూచించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం బీసీ కమిషన్ బహిరంగ విచారణ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, రిజిస్ట్రేషన్, సెక్రటేరియట్, వ్యాలిడేషన్, నోటరీ డెస్క్ బృందాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని వివిధ బృందాలు చేపట్టవలసిన పనులను దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ విచారణ కార్యక్రమంలో పాల్గొంటున్న టీమ్స్ అన్ని తమ విధులను సక్రమంగా నిర్వహించి కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. టీం లీడర్లు వారికి కేటాయించిన సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, విచారణను పూర్తిగా రికార్డింగ్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ఉపసంచాలకులు జి.ఆశన్న, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ అనంతం, డీపీఆర్ఓ అబ్దుల్ కలీం, కలెక్టరేట్ ఏవో సదానందం, బీసీ సహాయ సంక్షేమ అధికారులు పి నరసింహులు, ఎస్ హెచ్ ఓ లు, డిప్యూటీ తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.


Similar News