Double bedroom houses : డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి
డబుల్ బెడ్ రూమ్ గృహ సముదాయాన్ని వారం రోజుల్లోగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు.
దిశ, హైదరాబాద్ బ్యూరో : డబుల్ బెడ్ రూమ్ గృహ సముదాయాన్ని వారం రోజుల్లోగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. మంగళవారం ముషీరాబాద్ మండలంలోని కవాడిగూడ , ఎల్బీనగర్ లోని బాకారం డబుల్ బెడ్ రూమ్ గృహ సముదాయాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణ
పనులు పూర్తయినందున లబ్ధిదారులకు గృహాలను అందించేందుకు వారం రోజుల్లోగా సిద్ధం చేయాలని సూచించారు. అంతకు ముందు కలెక్టర్ సాయి చరణ్ కాలనీ, నాగమయ్య కుంట డబుల్ బెడ్ రూం సముదాయాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఆర్డీఓ దశరథ్ సింగ్, హౌసింగ్ డీఈ గంగాధర్, తహసీల్దార్ రాణా ప్రతాప్ సింగ్, ఏఈ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.