Hyderabad Metro:శాశ్వతంగా పెయిడ్ పార్కింగ్ రద్దు చేయాలని ధర్నా..

ఉప్పల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ ముందు ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

Update: 2024-08-25 06:54 GMT

దిశ,ఉప్పల్:ఉప్పల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ ముందు ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తాత్కాలిక వాయిదా కాకుండా శాశ్వతంగా పెయిడ్ పార్కింగ్ రద్దు చేయాలని మెట్రో ప్రయాణికులు ధర్నాకు దిగారు.నాగోల్, మియాపూర్ మెట్రో పార్కింగ్ ఉచిత పార్కింగ్ ఉండాలని, పెయిడ్ పార్కింగ్ పెడితే సామాన్య ప్రయాణికుల మీద భారం పడుతుందని అంటున్నారు.

ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ప్రెసిడెంట్ ప్రదీప్ మాట్లాడుతూ..నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉచిత పార్కింగ్ కొనసాగించాలని అన్నారు. మెట్రో జర్నీ ప్రారంభమై దశాబ్దం కాలేదు. నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్‌కి గంటల్లో ఇంత, ఎన్ని గంటలు దాటితే ఇంత అని పెట్టడం శోచనీయమన్నారు. మెట్రో అధికారులు ప్రకటించిన పెయిడ్ పార్కింగ్ శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

విశిష్ట ఎంబీబీఎస్ విద్యార్ధిని నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉచిత పార్కింగ్ ను కొనసాగించాలని అన్నారు. పెయిడ్ పార్కింగ్ పెడితే ప్రయాణికులు ఎవరు మెట్రోను ఉపయోగించారని, మెట్రో చాలా నష్టపోతుందని అన్నారు. అడ్డగోలు చార్జీలు పెట్టడం వల్ల సామాన్యులపై భారం పడుతుందని మెట్రో యాజమాన్యంపై మడ్డిపడ్డారు. తాత్కాలికంగా వాయిదా కాకుండా శాశ్వతంగా పెయిడ్ పార్కింగ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


Similar News