దిశ, వెబ్డెస్క్: సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర నూతన కార్యదర్శిగా మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం మూడోసారి ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్లో జరుగుతున్న పార్టీ రాష్ట్ర మూడవ మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేనికి మరో అవకాశం ఇవ్వగా, 60 మంది కార్యదర్శి వర్గ సభ్యుల ఎన్నిక కూడా మంగళవారం పూర్తి చేశారు. కాగా, రాష్ట్ర కార్యదర్శి రేసులో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, నవ తెలంగాణ మాజీ సంపాదకులు, సీఐటీయూ లీడర్ ఎస్.వీరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నేత బి. వెంకట్ పేర్లు కూడా వినిపించాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పార్టీ వర్గాలు మళ్లీ తమ్మినేని వీరభద్రాన్నే ఎన్నుకున్నారు. కాగా, మూడ్రోజుల పాటు జరిగిన ఈ రాష్ట్ర మహాసభల్లో పలు కీలక తీర్మాణాలు చేశారు.