hundi Counting : లాల్​దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయ హుండీల లెక్కింపు

హైకోర్టు ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ అసిస్టెంట్​ కమిషనర్​ బాలాజీ ఆధ్వర్యంలో భారీ పోలీస్​ బందోబస్తు నడుమ లాల్​దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలోని రెండు హుండీలను బుధవారం లెక్కించారు.

Update: 2024-07-31 16:26 GMT

దిశ, చార్మినార్​ : హైకోర్టు ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ అసిస్టెంట్​ కమిషనర్​ బాలాజీ ఆధ్వర్యంలో భారీ పోలీస్​ బందోబస్తు నడుమ లాల్​దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలోని రెండు హుండీలను బుధవారం లెక్కించారు. హైకోర్టు ఆదేశాల మేరకు బోనాల జాతర సందర్భంగా లాల్​దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలోని మూడు హుండీలలో వచ్చే కానుకలు, నగదును నూతన బ్యాంక్​ ఖాతాలో జమచేయాలని దేవాదాయశాఖ అధికారులను ఆదేశించింది. దీంతో దేవాదాయ శాఖ అసిస్టెంట్​ కమిషనర్​ బాలాజీ ఆధ్వర్యంలో సింహవాహిని మహంకాళి ఆలయ కమిటీ సమక్షంలో రెండు హుండీలను లెక్కించగా

    రూ.3 లక్షల 31వేల 301 ఆదాయం వచ్చింది. మరో హుండీకి సంబంధించిన తాళాలు తెరుచుకోకపోవడంతో ఆ హుండీకి అధికారులు సీల్​ వేశారు. హండీల లెక్కింపులో వచ్చిన రూ.3 లక్షల 31వేల 301 ఆదాయాన్ని సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయం పేరిట నూతన బ్యాంక్​ అకౌంట్​ను తెరిచి అందులో జమ చేశారు. అతి త్వరలో మూడవ హుండీ తాళాలు కూడా తెరిచి, అందులో వచ్చిన ఆదాయాన్ని కూడా నూతన బ్యాంక్​ ఖాతాలో జమచేయనున్నారు. హుండీ లెక్కింపులో

    చీఫ్​ ఫెస్టివల్​ ఆఫీసర్​ అంజనా రెడ్డి, దేవాదాయ శాఖ ఇన్​స్పెక్టర్​ సురేందర్​, ఆలయ కమిటీ అధ్యక్షుడు సి.రాజేందర్​యాదవ్​, ప్రధాన కార్యదర్శులు మారుతి యాదవ్​, చంద్రకుమార్​, కోశాధికారి సతీష్​ ముదిరాజ్​, కన్వీనర్​ జి.అరవింద్​కుమార్​ గౌడ్​, మాజీ చైర్మన్​లు విష్ణుగౌడ్​, బంగ్లారాజు యాదవ్​, లక్ష్మీనారాయణ గౌడ్​, మాణిక్​ ప్రభుగౌడ్​, కె.వెంకటేష్​, రాజ్​కుమార్​ యాదవ్​, సభ్యులు సంగ ప్రకాష్​, వినోద్​కుమార్​, విఠల్, తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News