R. S. Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అవినీతి సర్వే రిపోర్టు
సమాజంలో అవినీతి నిర్మూలన కోసం పనిచేస్తున్న యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ గత రెండు సంవత్సరాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో అవినీతి నిర్మూలనపై సర్వే నిర్వహిస్తోందని సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు.
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : సమాజంలో అవినీతి నిర్మూలన కోసం పనిచేస్తున్న యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ గత రెండు సంవత్సరాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో అవినీతి నిర్మూలనపై సర్వే నిర్వహిస్తోందని సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన తెలిపారు. ప్రభుత్వ అధికారుల పనితీరు ఎలా ఉంది, ఓ సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయానికి వెళితే అధికారుల ప్రవర్తన ఎలా ఉంది వంటి పలు అంశాలపై సర్వే నిర్వహించామని, ఆ సర్వే రిపోర్టును రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు ప్రతిపక్షపార్టీలకు కూడా అందజేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ సీనియర్ ఐఏఎస్ ఆకునూరి మురళికి సర్వే రిపోర్టును అందజేశామన్నారు. ఈ రిపోర్టు ఆధారంగా అవినీతికి పాల్పడుతున్న వారి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవినీతి రహిత సమాజం కోసం పాటుపడేలా చూడాలని విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొన్నె దేవేందర్, నాగేంద్ర, మణిదీప్, బత్తిని రాజేశ్, కొల్లె భవాని పాల్గొన్నారు.