హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. విద్యుత్ వైర్లు తెగి కానిస్టేబుల్ మృతి
ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కరెంట్ షాక్ కి గురై ఒక వ్యక్తి మరణించిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ ఎస్సై నర్సింగ్ రావు తెలిపిన వివరాల ప్రకారం వ్యాస్ నగర్
దిశ, జూబ్లిహిల్స్ : ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కరెంట్ షాక్ కి గురై ఒక వ్యక్తి మరణించిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ ఎస్సై నర్సింగ్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యాస్ నగర్ , గండిపేటకు చెందిన సోలెం వీరస్వామి ( 45 ) గ్రే హౌండ్స్ గండిపేట యూనిట్‌లో ఏఆర్‌పీసీగా పని చేస్తుంటాడు .యూసుఫ్ గూడా బెటాలియన్‌లో పని చేసే తన తమ్ముడిని కలిసి, తిరిగి వెళ్తున్న క్రమంలో ఆయన ఆదివారం రాత్రి 9.40 - 10 గంటల సమయంలో సోలేం వీరాస్వామి తన బైక్ మీద, టీ వీ 5 నుండి ఎన్ టి ఆర్ భవన్ వైపు ఫ్రీ లెఫ్ట్ దారిలో వెళ్తుండగా, భారీవర్షం తో కూడిన బలమైన ఈదురు గాలులు వీచటంతో అదుపు తప్పి బైక్‌తో సహా ఫుట్ పాత్ పై పడగా, పుట్ పాత్ మీద వున్న కరంట్ స్తంభం నుండి విద్యుత్ సరఫరా అయ్యి ఒక్కసారిగా షాక్ తగలడంతో వీరస్వామి అక్కడికక్కడే మృతిచెందాడు .
డయాల్ 100 ద్వారా సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పెట్రోలింగ్ సిబ్బంది వెళ్లి చూడగా స్పందన లేకపోవటంతో , వెంటనే అంబులెన్సు ద్వారా అపోలో, జూబ్లీహిల్స్ కు తరలించగా , అప్పటికే మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారని జూబ్లిహిల్స్ పోలీస్ లు తెలిపారు. వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నమని ఎస్ఐ నర్సింగ్ రావు తెలిపారు.