మతాల మధ్య చిచ్చుపెట్టడమే బీజేపీ లక్ష్యం: Mallu Ravi
మతాల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ లక్ష్యమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్కొన్నారు...
- బీజేపీ పుట్టకముందే హిందు మతం ఉంది
- అన్ని పార్టీల్లో వివిధ మతస్తులు ఉన్నారు.
- రాజకీయాలకు ముడి పెట్టడం సరికాదు
- ప్రజా సంక్షేమమే గెలుపునకు ప్రోత్సాహం
- - టీపీసీసీ వైస్ప్రెసిడెంట్ మల్లు రవి
దిశ, తెలంగాణ బ్యూరో: మతాల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ లక్ష్యమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్కొన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ...బీజేపీ పుట్టకముందే దేశంలో హిందు మతం ఉన్నదన్నారు.అన్ని పార్టీల్లో వివిధ మతస్తుల లీడర్లు ఉంటారని, కానీ రాజకీయంగా ముడిపెట్టడం సరికదన్నారు.బీజేపీ నిర్వహించే హిందు ఏక్తా యాత్ర ఆయా వర్గాలను విడగొట్టేందుకు మాత్రమేనని చెప్పారు. కరీంనగర్‌లో బీజేపీ పెట్టిన హిందు ఏక్తా యాత్ర హిందువుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉందన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తే..ఎప్పటికీ ఫలించవని చెప్పారు. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత మతాన్ని రెచ్చగొట్టి రాజకీయాలు నడిపిస్తున్నారన్నారు. ప్రజల మధ్య మత చిచ్చు పెట్టి ఫలితాలను పొందడం సాధ్యం కాదన్నారు. ప్రజా సంక్షేమమే గెలుపునకు ప్రోత్సాహం ఉంటుందని మల్లు రవి హితవు పలికారు.