Hyderabad Collector:ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం కల్పించాలి

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బస్తీలు, స్లమ్ ప్రాంతాలలోని

Update: 2024-09-09 15:01 GMT

దిశ ,హైదరాబాద్ బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బస్తీలు, స్లమ్ ప్రాంతాలలోని పేద పిల్లలకు మంచి చదువు చెప్పడంతో వారు బాగా చదవడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగు పడుతాయని హైదరాబాద్  జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ యాప్ లో విద్యార్థుల హాజరు శాతం ఈ వారం పెంచిన 10 పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఏర్పాటు చేసిన "కాఫీ విత్ కలెక్టర్ "కార్యక్రమంలో డీఈఓ ఆర్.రోహిణి తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల్లో అత్యధికంగా హాజరు శాతం పెంపొందించి నందుకు స్వయంగా కలెక్టర్ అట్టి ఉపాధ్యాయులను పిలిపించి వారితో కలిసి కాఫీ సేవించారు.పాఠశాలల్లో హాజరు శాతం పెంచడం తో పాటు పిల్లలకు నాణ్యమైన విద్య బోధన జరిగేలా ప్రధానోపాధ్యాయులను ప్రోత్సహించేందుకు కాఫీ విత్ కలెక్టర్ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఉపాధ్యాయులు పిల్లలతో అనుబంధం పెంచుకోని వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నారు.

ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాల, నాంపల్లి సెక్షన్ కాలనీ ఏన్ఎన్ఆర్ పురం పాఠశాలలో 1357 మంది విద్యార్థులకు 1347 విద్యార్థులు హాజరయ్యారని, ఈ పాఠశాలను మిగతా పాఠశాలలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ వారం పాఠశాలల్లో హాజరు శాతం బాగా పెంచిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల అమీర్ పేట్, ఖైరతాబాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ శాంత రాథోడ్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల లంగర్ హౌస్ తెలుగు హెచ్ఎం ఉమారాణి, హుమాయున్ నగర్ హెచ్ఎం మహమ్మద్ ముజాహిద్ అలీ, నల్లకుంట హెచ్ ఎం జి సుజాత, ఎల్లారెడ్డి గూడ గూడ హెచ్ఎం పెర్సీ, నాంపల్లి సెక్షన్ కాలనీ ఎన్ ఆర్ ఆర్ పురం హెచ్ఎం కే.గీత, రసూల్ పుర పోలీసు లైన్ హెచ్ ఎం జి రంగనాథ్, తిరుమలగిరి హెచ్ ఎం కె విష్ణు వర్ధన్ రెడ్డి, అంబర్పేట్ జినాప బాగ్ హెచ్ఎం వందన శర్మ,అమీర్పేట్ ధరం కారం రోడ్డు ప్రభుత్వ ఉన్నదా పాఠశాల హెచ్ఎం ఎండి అంజద్ అలీ ఖాతిబ్ 10 పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పని తీరు చాలా బాగుందని ప్రశంసిస్తూ, హాజరు శాతం మరింత పెరిగేలా కృషి చేయాలన్నారు. అనంతరం ప్రధాన ఉపాధ్యాయుల తో ఇష్ట గోష్టి గా మాట్లాడారు. వారి పనితీరు, అనుభవాలను తెలుసుకొని వారి సేవలకు ప్రశంసించి అభినందనలు తెలిపారు.


Similar News