ఓయూలో సీఎం దిష్టిబొమ్మ దహనం..

లగ చర్ల గ్రామంలో అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు.

Update: 2024-11-13 10:42 GMT

దిశ, సికింద్రాబాద్ : లగ చర్ల గ్రామంలో అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. అరెస్టును నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద బీఆర్ఎస్వీ నాయకులు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫార్మాసిటీ రైతులను, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామంలో అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు రమేష్, చాటారి దశరథ్, జంగయ్య, కొంపెల్లి నరేష్, నాగారం ప్రశాంత్, శ్రీను నాయక్, క్యాదాసి రవి, శ్రీకాంత్ ముదిరాజ్, కోదాటి నాగేంద్రరావు, అవినాష్, పవన్ కుమార్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News