సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న విభేదాలు!
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఫొటో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది.
దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఫొటో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి ఫొటో లేకుండా దానం నాగేందర్ వర్గీయులు ఫ్లెక్సీలు విడుదల ఏర్పాటు చేయడంతో విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఫొటోలు లేకుండా ఎలా వేస్తారని ప్రశ్నించారు. మేం ఏమైనా ఇతర పార్టీలో ఉన్నామా? అంటూ మండిపడ్డారు. గొడవ అనంతరం విజయలక్ష్మి మేసేజులు డిలీట్ చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఫొటోలు జత చేసి దానం అనుచరులు మరో ఫ్లెక్సీ వదిలారు. కాగా, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఎమ్మెల్యేగా ఉండగా.. కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ నుంచి దానం, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేస్తుండటంతో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.