శ్రీచైతన్య కాలేజీ ఫుడ్ పాయిజన్ ఘటనపై బాలల హక్కుల కమిషన్ సీరియస్

మాదాపూర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ అక్షర బాలికల క్యాంపస్‌ లో ఫుడ్‌ పాయిజన్‌ ​​ఘటనను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్ గా తీసుకుంది.

Update: 2024-10-01 15:04 GMT

దిశ, శేరిలింగంపల్లి : మాదాపూర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ అక్షర బాలికల క్యాంపస్‌ లో ఫుడ్‌ పాయిజన్‌ ​​ఘటనను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్ గా తీసుకుంది. ఆయా ఛానళ్లు, పేపర్లలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా పరిగణించి శ్రీ చైతన్య అక్షర క్యాంపస్ హాస్టల్​ను మూసివేయాలంటూ సంబంధిత అధికారులకు సిఫారసు చేసింది.

    రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నెరేళ్ల శారద శ్రీ చైతన్య కాలేజీని సందర్శించి ఆగ్రహం వ్యక్తం చేసిన 24 గంటల్లోనే బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ యాక్షన్ తీసుకోవడం గమనార్హం. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవడం, కనీస సదుపాయాలు కూడా లేకపోవడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరిస్తున్నట్లు ఆ కమిషన్ చైర్మన్ జె. శ్రీనివాస్ పేర్కొన్నారు. 

Tags:    

Similar News