కుల గణన ప్రక్రియ అనేది అంత మంచిది కాదేమో : నాదెండ్ల భాస్కరరావు

కుల గణనకు తాను వ్యతిరేకం కాదని.. కానీ సూచన చేయాలనుకున్నట్లు మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు తెలిపారు.

Update: 2024-11-11 09:22 GMT

దిశ, జూబ్లీహిల్స్: కుల గణనకు తాను వ్యతిరేకం కాదని.. కానీ సూచన చేయాలనుకున్నట్లు మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు తెలిపారు. సోమవారం జూబ్లీహిల్స్ లోని నాదెండ్ల భాస్కర్ రావు నివాసంలో ఆయన పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల భాస్కర్ రావు మాట్లాడుతూ.... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన ప్రక్రియ అనేది అంత మంచిది కాదేమో అని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచన చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఋణపడి ఉంటాను అని నాదెండ్ల భాస్కర్ రావు తెలిపారు. కింది స్థాయి కులాలు అనుకునే వాళ్ళు.. పెద్ద స్థాయి కులాల వాళ్ళ ఇంటి పక్కనే భూములు కొని ఇండ్లు కట్టుకుంటున్నారన్నారు. అలాంటి పరిస్థితిలో.. కుల గణనతో ఇబ్బంది వస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. గజిబిజి లేకుండా సాఫీగా జరగాలని సూచించారు. సుప్రీంకోర్టు 50 శాతం రిజ్వేషన్లను మాత్రమే అంగీకారం ఇచ్చాయని.. కుల గణనతో రిజర్వేషన్ పెంచాలని అనుకున్న కోర్టుల్లో ఇబ్బంది పడుతుంది అనే అనుమానం ఉందన్నారు. గ్రామాల్లో అలజడి వచ్చే పరిస్థితి వస్తుందన్నారు.

కులం తెలుసుకోవాలని అనుకుంటే అనేక మార్గాలు ఉన్నాయని.. కుల గణనని గెలికి.. అలజడి క్రియేట్ అయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. మంచి వాతావరణం చెడగొట్టిన వాళ్ళ అవుతారన్నారు. మోడీ బీసీ నే కదా..? ఆయన మంచి పాలనా చేస్తున్నారు కదా అని మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు అడిగారు. కుల గణన మంచిది కాదేమో జాగ్రత్త అని సూచించారు. ఎస్సీ వర్గీకరణ కూడా సరికాదని.. రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన వయసుకు తగిన బాధ్యత కాదని.. ఐనా బాగా పరిపాలన చేస్తున్నారని మెచ్చుకున్నారు. మూసీ క్లీన్ చేయడం అవసరం.. దాన్ని కడిగి పారేయక పోతే కష్టమన్నారు. కులగణనను నేను వ్యతిరేకిస్తున్న అని నాదెండ్ల భాస్కర్ రావు తెలిపారు. ఇంకా మాట్లాడుతూ.. “ సీఎం రేవంత్ రెడ్డి తన వయస్సుకి పెద్ద అధికారం చేస్తున్నాడు. వయస్సుకు తగ్గ మంచి పని చేస్తున్నాడు. నేను 1950 ప్రాంతంలో హైదరాబాద్ కి వచ్చి 1955 నుండి విద్యాభ్యాసం అంతా ఇక్కడే చేసా, అందరూ అన్ని కులాలు వారు కలిసి ఉన్నము. ఈ కుల గణన లెక్కలు తీసి ప్రజలకు ఏమి సహాయం చేస్తారు. వారికి ఆర్థికంగా సహాయం చేయండి” అని ప్రభుత్వానికి సూచన చేశారు. మూసీ ప్రక్షాళన చేయడం చాలా గొప్ప పని అని కొనియాడారు.


Similar News