బీజేపీ నాయకుడిపై దాడి ఘటనలో ముగ్గురిపై కేసులు నమోదు
కోర్టులో పెండింగ్ ఉన్న స్థలం విషయంలో జరిగిన ఘర్షణలో బీజేపీ నాయకుడిపై దాడిచేసి గాయపరిచిన ఘటనలో ముగ్గురిపై ఛత్రినాక పోలీసులు కేసులు నమోదు చేశారు.
దిశ, చార్మినార్ : కోర్టులో పెండింగ్ ఉన్న స్థలం విషయంలో జరిగిన ఘర్షణలో బీజేపీ నాయకుడిపై దాడిచేసి గాయపరిచిన ఘటనలో ముగ్గురిపై ఛత్రినాక పోలీసులు కేసులు నమోదు చేశారు. వివరాలలోకి వెళితే ... పాతబస్తీ అలియాబాద్ లో ఈ నెల 2వ తేదీన కోర్టులో పెండింగ్ ఉన్న స్థలంలో విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించిన వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన బీజేపీ సీనియర్ నాయకుడు పొన్న వెంకటరమణ పై విజయలక్ష్మి కుటుంబ సభ్యులు కటర్ పైప్ తో దాడిచేశారు. దీంతో బాధితుడు పొన్న వెంకటరమణ తనపై దాడికి పాల్పడిన వారిపై ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్న ఛత్రినాక పోలీసులు డి.విజయలక్ష్మి , సయ్యద్, దేశం నరేష్ లపై 329(4), 324(4), 303(2), 118(1)రెడ్ విత్ 3(5) బిఎన్ ఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసును ఛత్రినాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.