BRS LIST: కులాలవారీగా బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ఇదే..
రానున్న ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ మేరకు అభ్యర్థుల తొలి జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించారు..
దిశ, వెబ్ డెస్క్: రానున్న ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ మేరకు అభ్యర్థుల తొలి జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించారు. సామాజిక వర్గాలుగా పరిశీలన చేసి మొత్తం 115 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. ఎక్కువ శాతం సిట్టింగులనే బరిలోకి దించుతున్నారు. అయితే 9 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. నాంపల్లి, నర్సాపూర్, గోషామహల్, జనగామ సీట్ల అభ్యర్థుల ప్రకటనను పెండింగ్‌లో పెట్టారు.
సామాజిక వర్గాలుగా బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ఇదే..
రెడ్డి సామాజిక వర్గం: హుజూరాబాద్-కౌశిక్ రెడ్డి, సుద్దపల్లి దాసరి మనోహర్ రెడ్డి, బాల్కండ-వేముల ప్రశాంత్ రెడ్డి, బాన్సువాడ-పోచారం శ్రీనివాసరెడ్డి, ఆర్మూర్-ఆశన్నగారి జీవన్ రెడ్డి, ముథోల్- విఠల్ రెడ్డి, నిర్మల్-ఇంద్రకరణ్ రెడ్డి, దుబ్బాక -కొత్త ప్రభాకర్ రెడ్డి, ఉప్పల్- బండారి లక్ష్మారెడ్డి, మేడ్చల్- మల్లారెడ్డి, పటాన్ చెరు- జి.మహిపాల్ రెడ్డి, నారాయణ ఖేడ్ -భూపాల్ రెడ్డి, మెదక్- పద్మా దేవేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం-మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎల్బీనగర్-దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మహేశ్వరం- సబితా ఇంద్రారెడ్డి.
వెలమ: గజ్వేల్, కామారెడ్డి- కేసీఆర్, సిరిసిల్ల- మంత్రి కేటీఆర్, కోరుట్ల- కె. సంజయ్ కుమార్, జగిత్యాల- సంజయ్ కుమార్, వేములవాడ- లక్ష్మీనరసింహరావు, సిద్దిపేట-హరీశ్ రావు, మల్కాజ్ గిరి-మైనంపల్లి హనుమంతరావు, మంచిర్యాల-నడిపల్లి దివాకరరావు.
కమ్మ: శేరిలింగంపల్లి-అరికెపూడి గాంధీ, సిర్పూర్- కోనేరు కోనప్ప, ఖమ్మం - పువ్వాడ అజయ్ కుమార్, జూబ్లీ హిల్స్ - మాగంటి గోపీ నాథ్ , మిర్యాలగూడ - నల్లమోతు భాస్కర్‌రావు.
మున్నూరుకాపు: నిజామాబాద్-బాజిరెడ్డి గోవర్థన్, రామగుండం- కోరుకంటి చందర్, మంథని-పుట్టామధు, కరీంనగర్- గంగుల కమలాకర్, ఆదిలాబాద్- జోగు రామన్న, ఎల్లారెడ్డి- జూజుల సురేందర్.
బీసీ: సంగారెడ్డి- చింతా ప్రకభాకర్ (పద్మశాలి), కుత్బుల్లాపూర్( గౌడ) , రాజేంద్రనగర్- ప్రకాశ్ గౌడ్ (గౌడ)
ఎస్సీ: ధర్మపురి- కొప్పుల ఈశ్వర్, చొప్పదండి-సుంకే రవిశంకర్, మానకొండూరు- రసమయి బాలకిషన్, ఆంథోల్- క్రాంతికిరణ్, జహీరాబాద్- మాణిక్ రావు( మాదిగ), చెన్నూరు- బాల్క సుమన్ (మాల), జుక్కల్-హన్మంత షిండే.
ఎస్టీ: ఆసిఫాబాద్ -కోవా లక్ష్మి, ఖానాపూర్-జాన్సన్ భూక్యానాయక్, బోథ్ -అనిల్ జాదవ్.
బ్రాహ్మిణ్: హుస్నాబాద్- వి. సతీశ్ కుమార్.
వైశ్య: నిజామాబాద్ అర్బన్- బీగాల గణేష్
Read More : బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్.. సిట్టింగ్ ఎమ్మెల్యేకు మొండిచేయి